Akhanda2 Movie Update : బాల కృష్ణ, బొయపాటి మూవీ అప్డేట్.



బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రాలలో సింహ, లెజెండ్ మరియు అఖండ వంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి. ఇవి కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బద్దలు కొట్టాయి. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్నతదుపరి చిత్రం 'అఖండ 2 ". భారీ అంచనాల నడుమ రూపొందుతున్నఈ 'అఖండ 2 "చిత్రంపై బాలకృష్ణ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం యొక్క మేకర్స్ఒక ఆసక్తికరమైన సంమచారం బయటికి వచ్చింది.ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ఏమిటి అంటే.

Also Read:  Indirama House Construction: 5 లక్షలకే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం మరింత సమాచారం కోసం...

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'అఖండ "చిత్రం అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రాన్ని 'అఖండ 2 "కి సీక్వెల్గా ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన అద్భుతమైన పోస్టర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. షూటింగ్ కు సంబంధించిన వివరాలు.



అఖండ 2 కోసం ఒక ప్రత్యేకమైన పోస్టర్ను చిత్ర మూవీ మేకర్స్ విడుదల చేశారు."అఖండ 2 " తాండవ్ ప్రయాగ్రాజ్లోని మహాకుంభ్ మేళాలో షూటింగ్ ప్రారంభమవుతుంది మరియు ఈ చిత్రంలో విశ్వాసం మరియు భక్తి ఉంటుంది. ఈ చిత్రం 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మహాకుంభ మేళాలో చిత్రీకరణ జరుగుతుంది.  అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో బాల కృష్ణ చేతిలో త్రిశూలం పట్టుకుని ఉండటం మనం చూడవచ్చు.

బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'అఖండ 2 ". ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశం అయిన మహా కుంభమేళాలోఇప్పుడు అఖండ 2 మూవీ షూట్ జరుగుతుంది. ప్రయాగ్రాజ్ ప్రస్తుతం అనేక ముఖ్యమైన "అఖండ 2-తాండవం" ఎపిసోడ్లను చిత్రీకరిస్తున్నారు. ఈ మేరకు దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, "మహాకుంభ మేళా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మేము జనవరి 11న  ప్రయాగ్రాజ్ వచ్చాము.

Also Read: Terahertz Radiation : 6జి సాంకేతిక పరిజ్ఞానం వల్ల పురుషులలో సంతానోత్పత్తి సమస్యలు.

ఈ కుంభమేళా సందర్భంగా లక్షలాది అఘోరాలు, నాగా సాధువులు, కోట్లాది మంది భక్తుల మధ్య ఈ అఘోరా నేపథ్య చిత్రాన్ని చిత్రీకరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఆయన నాగా, అఘోరాకు చెందిన సాధువులను కలిసాము. ఈ రోజు చివరి షూట్ చేస్తున్నాము. "ఈ షూటింగ్లో జాగ్రాత్తగ అఖండ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నాం" అని దర్శకుడు బోయపాటి చెప్పారు.

అఖండ 2 విడుదల భారతదేశం అంతటా జరుగుతుంది. ఈ చిత్రం హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. 14 రీల్స్ ప్లస్ బ్రాండ్ కింద రామ్, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సౌండ్ట్రాక్ను కూడా తమన్ స్వరపరిచారు. సెప్టెంబర్ 25,2025, ఈ చిత్రం థియేటర్లలో విడుదల అవుతుంది అని చెప్పారు.


Post a Comment

Previous Post Next Post